- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరి పుష్కరాలపై త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కీలక సమీక్ష
రానున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రానున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ త్వరలో రాజమహేంద్రవరంలో అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళవారం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో పవన్‌తో భేటీ అనంతరం ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
భారీ అంచనాలు.. వేగవంతంగా పనులు
పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. భక్తుల భద్రత, వసతులకే తొలి ప్రాధాన్యం. రాజమహేంద్రవరంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఘాట్‌ల వద్ద ఇప్పటికే ఆధునికీకరణ పనులు ప్రారంభం. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర కార్యాచరణ అమలు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం. తాగునీరు, పారిశుద్ధ్యం, విశ్రాంతి గదుల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. ఈ మహాక్రతువును ఎలాంటి లోపాలకు తావులేకుండా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించినట్లు మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.






