- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిలకలూరిపేట విద్యార్థులకు హామీ.. పది రోజుల్లోనే నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్
చిలకలూరిపేట విద్యార్థులకు ఇచ్చిన హామీని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదిరోజుల్లోనే నిలబెట్టుకున్నారు...

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyana) పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. తన దృష్టికి సమస్యలు వచ్చినా, ఆయన హామీ ఇచ్చినా వెంటనే వాటిని నెరవేర్చుతున్నారు. ఇటీవల తన ఊరికి రోడ్డు కావాలని పవన్ కల్యాణ్ దృష్టికి అంధ మహిళా క్రికెటర్ తీసుకెళ్లడంతో వెంటనే ఆ సమస్యను పరిష్కరించారు. తమకు ల్యాప్ టాప్‌లు కావాలని అడిగిన విద్యార్థులకు పది రోజుల్లోనే సమస్యను పరిష్కరించారు.
పల్నాడు జిల్లా(Palnadu District) చిలకలూరిపేట శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Chilakaluripet Sharada Zilla Parishad High School)లో కంపూటర్లు (Computers)లేవని పవన్ కల్యాణ్ దృష్టికి కొందరు విద్యార్థులు తీసుకెళ్లారు. దీంతో సోమవారం 25 కంప్యూటర్లను బహూకరించారు. వీటికి సొంతనిధులను వెచ్చించడమే కాకుండా స్కూల్లో అవసరమైన ఫర్నిచర్‌ను సైతం ఆయన అందించారు. పది రోజులు క్రితం ఈ హామీ ఇచ్చారు. తాజాగా మాట నిలబెట్టుకోవడంతో స్కూలు విద్యార్థులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.






