వంచన.. ఆపై హత్య: నిందితుల అరెస్ట్

by Vemula.Srinu Prasad |

అక్రమ సంబంధం నేపథ్యంలో ఒక మహిళను వంచన చేయడమే కాక ఆమెను ఒక అడ్వకేట్ దారుణంగా హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లాలో కలవరం పుట్టించింది. పాత గుంటూరు యాదవ బజారులో నివాసం ఉండే ఆకుల రమాదేవి భర్త శ్రీనివాసరావు చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో నివాసముంటుంది..

వంచన.. ఆపై హత్య: నిందితుల అరెస్ట్
X

దిశ, గుంటూరు ప్రతినిధి: అక్రమ సంబంధం నేపథ్యంలో ఒక మహిళను వంచన చేయడమే కాక ఆమెను ఒక అడ్వకేట్ దారుణంగా హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లాలో కలవరం పుట్టించింది. పాత గుంటూరు యాదవ బజారులో నివాసం ఉండే ఆకుల రమాదేవి భర్త శ్రీనివాసరావు చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో నివాసముంటుంది. ఈ నేపథ్యంలో గుంటూరు బార్ అసోసియేషన్‌లో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ ఎనుముల సురేష్ బాబు ఆమెతో పరిచయం పెంచుకొని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని చెప్పి ఆమె వద్ద నుండి క్రమంగా రూ. 25 లక్షలు కాజేశాడు. కాలం గడుస్తున్నప్పటికీ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె సురేష్‌ను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చి వెయ్యాలని తరచూ గొడవపడుతుంది.

ఇది సహించని సురేష్ ఆమెను హత్య చేయాలని పథకం వేశాడు. తన మిత్రుడు శేఖర్‌తో కలిసి అనుకున్న ప్రకారం హత్య చేశాడు. రమాదేవి తల్లి వెంకాయమ్మ తన కూతురు ఎక్కడుందని పలుమార్లు సురేష్‌ను అడిగినప్పటికీ నిర్లక్ష్య ధోరణితో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన ఆమె పాత గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆకుల రమాదేవి మిస్ అయినట్లుగా పోలీసులు తొలుత కేసు నమోదు చేశారు. అడ్వకేట్ సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. శ్రీశైలం వెళదామని నమ్మబలికి రమాదేవిని పిలిపించి కర్రతో తలపై హత్య చేసినట్లు నిందితులు కొట్టి సురేష్, అతని మిత్రుడు శేఖర్ ఒప్పుకున్నారని చెప్పారు. దీంతో ఇద్దరు నిందితులను కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Next Story