- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉ.10 నుంచి సా. 4 వరకు బయటకు రావద్దు: కలెక్టర్ సాయి కాంత్ వర్మ
రానున్న ఐదు రోజుల పాటు జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉండనుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు...

దిశ, గుంటూరు ప్రతినిధి: రానున్న ఐదు రోజుల పాటు జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉండనుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రానున్న ఐదు రోజులలో వేసవి తీవ్రత (హీట్ ఇండెక్స్) అధికంగా ఉంటుందని సూచించింది అన్నారు. 41° సెల్సియస్ నుండి 54° సెల్సియస్ వరకు ఎండ వేడిమి ఉండవచ్చని తెలియజేసిందన్నారు.
బయటకు రావద్దు
గుంటూరు తూర్పు, మేడికొండూరు, కొల్లిపర, మంగళగిరి, పొన్నూరు ఫిరంగిపురం, చేబ్రోలు, పెదనందిపాడు, తాడేపల్లి, తాడికొండ, గుంటూరు పశ్చిమం, పెదకాకాని, కాకుమాను, తెనాలి, వట్టిచెరుకూరు, తుళ్ళూరు, దుగ్గిరాల, ప్రత్తిపాడు మండలాలు ఈ ప్రభావానికి లోన అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అత్యవసర పనులు ఉంటే మినహా ప్రజలు ఎవరు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రావద్దని ఆయన సూచించారు. అత్యవసర పనులకు బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలని, వదులు దుస్తులు ధరించాలని, తగినంత నీటిని తాగాలని సూచించారు. చిన్నారులు, వయసు మీరినవారు బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు చూడాలని చెప్పారు. డీ హైడ్రేషన్ కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సాయి కాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు.
తప్పనిసరిగా జాగ్రత్తలు
ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపి, తలపాగా వంటివి ధరించాలన్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగవద్దని సూచించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు చలివేంద్రియాలు ఏర్పాటు చేయాలని, అధికారులు ప్రజలకు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తం చేయాలని సాయి కాంత్ వర్మ ఆదేశించారు.






