రాష్ట్రంలో మరో కీలక నిర్ణయం.. జూనియర్ ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-12 08:59:10  IST  )

ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది..

రాష్ట్రంలో మరో కీలక నిర్ణయం.. జూనియర్ ఐఏఎస్‌లను బదిలీ  చేస్తూ ఉత్తర్వులు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం(Alliance Government) ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఐఏఎస్‌లు(IAS), ఐపీఎస్‌(IPS)లను ఇప్పటికే పలుమార్లు ట్రాన్స్ ఫర్ చేసింది. ఇప్పుడు జూనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా పి.శ్రీనివాసులు, వైద్యారోగ్యశాఖ జాయింట్ సెక్రటరీగా గోపాలకృష్ణ, సివిల్ సప్లయి డైరెక్టర్‌గా శ్రీవాస్ నుపుర్, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కల్పన కుమారి, గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా మయూర్ అశోక్, తిరుపతి అర్బన్ డైవలప్ మెంట్ అధారిటీ చైర్మన్‌గా ఆర్ గోవిందరావు, కడప జేసీగా నిధి మీనా, అనంతపురం జేసీగా నిధి మీనా, చిత్తూరు జేసీగా ఆదర్శ రాజేంద్రన్, GCC ఎండీ S.S. శోభికా, విశాఖ జేసీగా గొబ్బిళ్ళ విద్యాధరీ, అన్నమయ్య జేసీగా శివ నారాయణ శర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story