- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap News: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై కలెక్టర్లకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ..

దిశ, వెబ్ డెస్క్: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై కలెక్టర్లకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో మంత్రి విడుదల రజినితో పాటు వైద్యారోగ్య శాఖ, ఆర్థిక, గ్రామవార్డు సచివాలయ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ జగనన్న సురక్ష క్యాంపులను విస్తృతంగా పెంచాలని అధికారులకు సూచించారు. ఆరోగ్య సురక్ష శిబిరాలకు వచ్చే రోగులకు మందులు అందించాలని ఆదేశించారు. జబ్జుల ఆధారంగా ఆయా ఆస్పత్రులకు రిఫర్ చేయాలని తెలిపారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు పూర్తిగా కోలుకునే వరకూ ప్రభుత్వమే చేదోడుగా ఉండాలన్నదే జగనన్న ఆరోగ్య సురక్ష ఉద్దేశమని చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని అధికారులను హెచ్చరించారు.
జగనన్న ఆరోగ్య సురక్షపై సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టర్లతో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్.#JaganannaArogyaSuraksha pic.twitter.com/KM57GE6ZsL
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 6, 2023






