- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దూకుడు పెంచిన సీఎం జగన్.. రీజినల్ కో ఆర్టినేటర్ల కీలక భేటీ
వచ్చే ఎన్నికలపై సీఎం జగన్ దూకుడు పెంచారు. ...

X
దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికలపై సీఎం జగన్ దూకుడు పెంచారు. ఇందుకు పార్టీ నేతలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈసారి తామే అధికారం చేపట్టాలనే గట్టి పట్టుమీదున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తున్నారు. వరుస కార్యక్రమాలతో ప్రతి ఒక్కరూ జనాల్లో ఉండాలని ఆదేశిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం జగన్‌తో తాజాగా పార్టీ రీజినల్ కో ఆర్టినేటర్లు భేటీ అయ్యారు. వచ్చే 3 నెలల వరకు జరిగే పార్టీ కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ భేటీ కొనసాగుతోంది. భేటీ అనంతరం ఈ మీటింగ్ సంబంధించిన మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Next Story






