మన రాష్ట్రానికి ఇవాళ చరిత్రాత్మకమైన రోజు: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

మన రాష్ట్రానికి ఇవాళ చరిత్రాత్మకమైన రోజు అని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీకి సీజేఐ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు..

మన రాష్ట్రానికి ఇవాళ చరిత్రాత్మకమైన రోజు: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మన రాష్ట్రానికి ఇవాళ చరిత్రాత్మకమైన రోజు అని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అన్నారు. అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీకి సీజేఐ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ రోజు మొత్తం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ (CJI Justice Suryakant) అమరావతి(Amaravati)లోనే ఉండటం తనకు ఎంతో సంతోషానచ్చిందన్నారు. రాష్ట్రంలో నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ(National Judicial Academy) నిర్మించడం ఆంధ్రుల అదృష్టమన్నారు. అమరావతిని గొప్ప నగరంగా తీర్చిదిద్దబోతున్నామన్నారు. పురాణాల్లో చూసుకుంటే దేవతల రాజధానిగా అమరావతి పిలవబడిందని చెప్పారు. ప్రజా రాజధాని అమరావతి అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పొల్యూషన్ లేని నగరంగా అమరావతిని నిర్మిస్తామని, ఇక్కడ ఉండేవారు 20 ఏళ్లు ఎక్కువగా జీవిస్తారన్నారు. తన చిన్నతనంలో విద్యుత్ లేక తీవ్ర అవస్థలు పడేవాళ్లమని, ఇప్పుడు ప్రతి భవనంపై కరెంట్ తయారు చేసే స్థాయికి చేరుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story