- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్ని మీకే తెలుసనుకుంటున్నారా..: కలెక్టర్లపై సీఎం సీరియస్.. క్లాస్
కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. ..

దిశ, వెబ్ డెస్క్: కలెక్టర్ల(Collectins)కు సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) క్లాస్ తీసుకున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి సెక్రటేరియట్‌లో ఆయన అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, అధికారుల సమావేశం నిర్వహించారు. కొందరు కొత్తగా వచ్చిన అధికారుల పట్ల ప్రజల నుంచి అందిన ఫీడ్ బ్యాక్‌ను ఉద్దేశించి సీరియస్ అయ్యారు. ఐఏఎస్ అయిపోయామని, అన్ని తమకే తెలుసని అనుకోవద్దని చెప్పారు. ప్రతి నిత్యం నేర్చుకుంటూనే ఉండాలని సూచించారు. క్షేతస్థాయిలో పని తీరు మరింత మెరుగుపర్చుకోవాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇంచార్జ్ మంత్రులు కూడా అదే వేగంతో క్షేత్రస్థాయిలో పనులు జరిగేలా చూడాలని చెప్పారు. గత 19 నెలల్లో ఏపీలో చేపట్టిన కార్యక్రమాలు, టెక్నాలజీ సహా ఏఐ అప్లికేషన్ల వినియోగం ఎలా జరుగుతుందో అంచనా వేసుకోవాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.






