జులై కల్లా రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’

by Vemula.Srinu Prasad |

వైద్యరంగంలో తెచ్చిన మార్పులు-సాధించిన ఫలితాలను బిల్ గేట్స్‌కు చెప్పామని, హై లెవెల్ ఎక్స్‌పర్ట్ అడ్వైజరీ గ్రూప్ ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు...

జులై కల్లా రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’
X

దిశ, వెబ్ డెస్క్: వైద్యరంగంలో తెచ్చిన మార్పులు-సాధించిన ఫలితాలను బిల్ గేట్స్‌కు చెప్పామని, హై లెవెల్ ఎక్స్‌పర్ట్ అడ్వైజరీ గ్రూప్ ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) తెలిపారు. అమరావతి(Amaravati)లో బిల్ గేట్స్‌(Bill Gates)తో సమావేశమైన ఆయన రాష్ట్రాభివృద్ధిని వివరించారు. డబ్లుహెచ్‌వో, అశోకా యూనివర్సిటీ సహకారంతో నేషనల్ హెల్త్ ఏఐ స్ట్రాటజీ వర్క్‌షాప్ నిర్వహించామని చంద్రబాబు పేర్కొన్నారు. యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్, ఏబీడీఎం (ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్) అమలు సహా తక్కువ ఖర్చుకే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 71 లక్షల మందికి 41 పరీక్షల ద్వారా స్క్రీనింగ్ పూర్తి చేశామని బిల్ గేట్స్‌కు చంద్రబాబు తెలిపారు.

సమగ్ర ఆరోగ్య వేదికగా ‘‘సంజీవని’

‘‘సంజీవని’ కార్యక్రమాన్ని సమగ్ర ఆరోగ్య వేదికగా తీర్చిదిద్దుతున్నాం. కుప్పంలో ఇప్పటికే సంజీవని పైలట్ ప్రాజెక్టు చేపట్టగా, విజయవంతమైంది. 2.9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయగా, 109 ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం. రాష్ట్రంలోని 5.2 కోట్ల ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా జూలై 2026 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ అమలు చేస్తాం. ప్రతి ఒక్కరికి ఏఐ డాక్టర్‌ను ఇవ్వాలనేది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. టీబీ రోగులకు పోషకాహారం అందిస్తున్నాం, ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో డీఎంఐడీసీ స్థాపించాం. ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టుగా ‘అమరావతి స్కూల్ ఆఫ్ బయోడిజైన్’ చేపట్టాం.’’ అని బిల్ గేట్స్‌కు చంద్రబాబు చెప్పారు.

Next Story