ఏపీకి మూడోసారి బిల్ గేట్స్.. ఆ ఘనత నాదే: చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

ఈ నెల 16న రాష్ట్రానికి బిల్ గేట్స్ వస్తున్నారని, మూడోసారి సైతం తీసుకొచ్చిన ఘనత తనదేనని సీఎం చంద్రబాబు అన్నారు...

ఏపీకి మూడోసారి బిల్ గేట్స్.. ఆ ఘనత నాదే: చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 16న రాష్ట్రానికి బిల్ గేట్స్(Bill Gates) వస్తున్నారని, మూడోసారి సైతం తీసుకొచ్చిన ఘనత తనదేనని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అన్నారు. అమరావతి అసెంబ్లీ లాబీ(Amaravati Assembly Lobby)ల్లో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ బిల్ గేట్స్ తొలిసారి హైటెక్ సిటీ సమయంలో తీసుకొచ్చానని, రెండోసారి విశాఖ అగ్రిటెక్ కోసం వచ్చారని తెలిపారు. ప్రస్తుతం సంజీవని పథకం కోసం బిల్ గేట్స్ రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొన్నారు. సంజీవిని స్కీంకు Rtgsలో కార్యక్రమం రూపిందించామని చెప్పారు. 1982లో హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ దాటితే అడవిలా ఉండేదని చంద్రబాబు గుర్తు చేశారు.

మొత్తం మారిపోయాయి..

మొత్తం నాలుగు సంవత్సరాలలో అక్కడి పరిస్థితులన్ని మారిపోయాయని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాంటి మార్పులే అమరావతి అభివృద్ధిలోనూ ఉంటాయన్నారు. ప్రతి ఎమ్మెల్యే పనితీరు నివేదిక తయారు చేసి సీల్డ్ కవర్‌లో ఇస్తున్నామని తెలిపారు. గతంలో మాదిరిగానే తాను ఉంటానని, ఇప్పటికైనా వాళ్లు మారకపోతే నష్టపోతారని చెప్పారు. ఎమ్మెల్యేల పని తీరుపై మొత్తం 9 పేరా మీటర్లలో సర్వే చేయిస్తున్నామని, అందులో తేలిన అంశాలనే నివేదిక ద్వారా అందిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలకు తెలియని పేరా మీటర్లు కూడా తన దగ్గర ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. లోకేశ్, తాను తమ పనిలో తామున్నామన్నారు. మంగళగిరి చీరలకు మంత్రి లోకేశ్ బాగా బ్రాండింగ్ కల్పిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story