దైవ కార్యంలా భావించాలి: అడవుల రక్షణపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

అడవులు(Forests), వన్యప్రాణుల రక్షణ(Wildlife Protection)పై రాష్ట్ర సీఎం చంద్రబాబు(Cm Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యతని, అడవులు, వన్యప్రాణుల సంరక్షణను ఒక దైవకార్యంలా భావించి ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన సూచించారు..

దైవ కార్యంలా భావించాలి: అడవుల రక్షణపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అడవులు(Forests), వన్యప్రాణుల రక్షణ(Wildlife Protection)పై రాష్ట్ర సీఎం చంద్రబాబు(Cm Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యతని, అడవులు, వన్యప్రాణుల సంరక్షణను ఒక దైవకార్యంలా భావించి ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో అటవీ ప్రాంతాల పాత్ర ఎంతో కీలకమని చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమల పవిత్ర పరిసరాలలో పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం ప్రస్తావించారు. తిరుమలలో గ్రీన్ కవర్ గణనీయంగా పెరిగి ప్రస్తుతం 89.4 శాతానికి చేరుకుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ పచ్చదనాన్ని మరింతగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

శేషాచలం కొండల పరిరక్షణపై....

అదేవిధంగా ఆధ్యాత్మిక, పర్యావరణ ప్రాధాన్యత కలిగిన శేషాచలం కొండల పరిరక్షణపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఇష్టానుసారంగా పెరిగిన అన్యదేశ మొక్కల స్థానంలో, స్థానిక పర్యావరణానికి మేలు చేసే స్వదేశీ మొక్కల పునరుద్ధరణ కార్యక్రమం వేగంగా జరుగుతోందని ఆయన తెలిపారు. తద్వారా అటవీ సంపదతో పాటు వన్యప్రాణులకు సహజ సిద్ధమైన ఆవాసం లభిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story