- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ, కర్ణాటక జలవివాదం.. సీజేఐ సంచలన వ్యాఖ్యలు
ఏపీ, కర్ణాటక జలవివాదం కేసును తేల్చుకుండా పదవీ విరమణ చేయనని సీజేఐ తేల్చి చెప్పారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీపై కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖైలన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ, కర్ణాటక జలవివాదం కేసును తేల్చుకుండా పదవీ విరమణ చేయనని సీజేఐ తేల్చి చెప్పారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీపై కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖైలన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల వివాదం సుదీర్ఘ విచారణ అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి విచారిస్తామన్నారు. విచారణను సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేశారు.
కాగా ఏపీ, కర్ణాటక మధ్య జలవివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే కృష్ణా బేసిన్‌లో మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యులుగా ఉన్నాయి. దీంతో కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రిబ్యునల్ తీర్పును కేంద్రప్రభుత్వం నోటిఫై చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తాత్కాలికంగా ఉత్తర్వులు జారీ చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.






