- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
breaking: నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు
by Vemula.Srinu Prasad |
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కొందరు అధికారుల పేర్లు రెడ్ బుక్‌లో నోట్ చేసుకుంటామని, అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై సీఐడీ సీరియస్ అయింది. అధికారులను రెడ్ బుక్ పేరుతో నారా లోకేశ్ బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ ఆయనపై చర్యలకు అనుమతివ్వాలంటూ సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం నారా లోకేశ్‌కు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. విచారణను జనవరి 9కి వాయిదా వేసింది. దీంతో సీఐడీ అధికారులు తాజాగా నారా లోకేశ్‌కు నోటీసులు జారీ చేశారు. ఆయన ఫోన్ వాట్సప్‌కు నోటీసుల పంపారు. దీంతో ఈ నోటీసులపై స్పందించిన నారా లోకేశ్.. సీఐడీ అధికారులకు సమధానం పంపారు. అయితే లోకేశ్ సమాధానం ఏంటనేది తెలియాల్సి ఉంది.
Next Story






