- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధిలో చిలకలూరిపేట మరో ముందడుగు..!
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే తమ లక్ష్యమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu District) చిలకలూరిపేట(Chilakaluripet) వాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే తమ లక్ష్యమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి చిలకలూరిపేట 6వ వార్డులోని బింగి రామ్మూర్తి పార్కులో సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రామ్మూర్తి పార్కులో ఆధునిక జిమ్ ఎక్విప్‌మెంట్, చిన్నపిల్లల కోసం ప్రత్యేక ఆట పరికరాలు, అలాగే ఆహ్లాదకరమైన వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయనునట్లు ఆయన తెలిపారు. ప్రజల ఆరోగ్యం, పిల్లల ఉల్లాసం కోసం ఈ పార్కును అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. త్వరితగతిన ఈ పనులు పూర్తి చేసి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు.






