- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Palnadu: దుకాణంలోకి దూసుకెళ్లి కారు బీభత్సం.. ఒకరి మృతి
by Vemula.Srinu Prasad |
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లిలో కారు బీభత్సం సృష్టించింది...

X
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి కారు దూసుకెళ్లింది. దుకాణంలో పని చేస్తున్న నాగేశ్వరరావు మృతి చెందారు. అటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నాగేశ్వరావు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story






