- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నరసరావుపేటలో యువకుడి దారుణ హత్య
నరసరావుపేటలో (Narasaraopet) దారుణం జరిగింది. ఓ యువకుడిని కొందరు దుండగులు హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది.

దిశ, వెబ్ డెస్క్ : నరసరావుపేటలో (Narasaraopet) దారుణం జరిగింది. ఓ యువకుడిని కొందరు దుండగులు హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం నరసరావుపేట ఎస్ఆర్కేటీ కాలనీ వద్ద షేక్ బాజీ అనే యువకుడు హత్యకు గురయ్యారు. బైక్ పై వెళ్తున్న అతడిని ఓ మహిళ, యువకుడు అడ్డగించారు. షేక్ బాజీపై వారు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రక్తపు మడుగులో పడి ఉన్న షేక్ బాజీని స్థానికులు గమనించారు. చికిత్స కోసం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఓ హోటల్ పక్కనే బాజీ టిఫిన్ సెంటర్ పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో హోటల్ వారితో బాజీకి వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. వివాదం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నారు.
గత నెల..
అయితే గత నెల జిల్లాలోని స్వర్గపురి-2లో కాటికాపరిగా పనిచేస్తున్న గాడిపర్తి ఎఫ్రాన్ (31)ను హత్యకు గురయ్యారు. నరసరావుపేట పట్టణం క్రిస్టియన్ పాలెంకు చెందిన ఎఫ్రాన్ 2 ఏళ్ల నుంచి స్వర్గపురిలో కాటికాపరిగా పని చేశారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉండవచ్చని బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2వ పట్టణ సిఐ హైమారావు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల వ్యవధిలోనే మరో హత్య చోటు చేసుకోవడంతో పట్టణంలో భయానక వాతావరణం నెలకొందని నివాసితులు అంటున్నారు.
హత్యకు గల కారణాలు తెలియరాలేదు
దిశ ప్రతినిధి. నరసరావుపేట : జిల్లా కేంద్రంలోని నరసరావుపేటలో ఓ యువకుడు దారుణ హత్య కు గురయ్యాడు. కొండలరావు పేటకు చెందిహోటల్ కార్మికుడిగా పనిచేసే షేక్ బాజీ ( 32) నీ ఆదివారం రాత్రి కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. బాజీ హత్యకు కారణాలు పూర్తిగా తెలియనప్పటికీ విన్న కథనాలు వినిపిస్తున్నాయి. బాజీనీ ఎస్ఆర్కేటీ కాలనీ సమీపంలో ఉన్న హోటల్ లో ఓ మహిళ, మరో యువకుడు అడ్డగించారని అక్కడ వారి మధ్య వాదోపవాదాలు జరిగి బాజీనీ ఆ ఇద్దరుమారణాయుధాలతో కొట్టి హత మార్చారన్న ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో ఘటనా స్థలాన్ని డీఎస్పీ హనుమంతరావు పరిశీలించారు. తెల్లవారుజామున హత్య జరిగిందని రూరల్ పోలీసులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదన్నారు.






