- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను ఆరోగ్యంగానే ఉన్నా.. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై బొత్స క్లారిటీ
తన ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తన ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని, తన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం రొటీన్ మెడికల్ చెకప్‌లో భాగంగానే ఆసుపత్రికి వచ్చినట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే?
గురువారం అర్ధరాత్రి బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమయ్యాయి. ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, వైద్యుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని వార్తలు రావడంతో వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అపోహలకు చెక్..
ఈ వార్తలపై బొత్స నేరుగా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఆస్పత్రికి వచ్చింది సాధారణ తనిఖీల కోసమే. అనవసరపు ప్రచారాలు నమ్మొద్దు’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్య వర్గాల సమాచారం ద్వారా కూడా తెలుస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు.






