పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పిన ధైర్యశాలి ఆయన: భూపతిరాజు శ్రీనివాస వర్మ

by Vemula.Srinu Prasad |

కార్గిల్ వార్‌తో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పిన ధైర్యశాలి వాజ్ పేయి అని భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు..

పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పిన ధైర్యశాలి ఆయన: భూపతిరాజు శ్రీనివాస వర్మ
X

దిశ, వెబ్ డెస్క్: లాహోర్ బస్సు యాత్ర(Lahore bus trip) ద్వారా పాకిస్తాన్‌(Pakistan)కు స్నేహ హస్తం అందిస్తే.. కానీ కుట్రలు చేశారని, కార్గిల్ వార్‌(Kargil War)తో బుద్ధి చెప్పిన ధైర్యశాలి వాజ్ పేయి(Vajpayee) అని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ(Union Minister Bhupathi Raju Srinivasa Varma) అన్నారు. అమరావతిలో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర(Atal Modi Suparipalana Yatra) ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ఇతర దేశాలతో దౌత్య సంబధాల ద్వారా దేశం గొప్పతనాన్ని వాజ్ పేయి చాటి చెప్పారని గుర్తు చేశారు. ఇందిరా మరణం తర్వాత రెండు సీట్లే బీజేపీకి వచ్చినా.. కష్ట సమయంలో కార్యకర్తలకు అండగా నిలిచారన్నారు. భవిష్యత్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని భరోసా ఇచ్చారన్నారు. బీజేపీ చరిత్ర అయిపోయిందని కొందరు అవహేళన చేశారని, సంకీర్ణ రాజకీయాలకు శ్రీకారం చుట్టి.... దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన నేత వాజ్ పేయ్ అని వ్యాఖ్యానించారు.

వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్‌గా ఉన్నారన్నారు. వారిద్దరూ కలిసి దేశంలో రాష్ట్రంలో చాలా అభివృద్ది కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. ఏపీలో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల సారధ్యంలో అభివృద్ది జరుగుతుందని తెలిపారు. వాజ్ పేయ్ ఆలోచనలకు అనుగుణంగా మోడీ పాలన సాగిస్తున్నారన్నారు. ఏపీలో చంద్రబాబు అదే స్పూర్తితో అభివృద్ది, సంక్షేమం సమాంతరంగా తీసుకు వెళుతున్నారని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతిలో మొట్టమొదటి సారిగా వాజ్ పేయ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చరిత్రలో నిలిచిపోతుందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.

Next Story