డిప్యూటీ ఎమ్మార్వో ఆదేశం: కారు కడిగిన వీఆర్ఏ.. వీడియో వైరల్

by Vemula.Srinu Prasad |

బాపట్ల జిల్లా కర్లపాలెం డిప్యూటీ ఎమ్మారో తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది...

డిప్యూటీ ఎమ్మార్వో ఆదేశం: కారు కడిగిన వీఆర్ఏ.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటే ఆ కిక్కే వేరెప్ప.. ఏ పైనా హాయిగా చేయించుకోవచ్చు. సొంత పనైనా, ఆఫీసు పైనానా నో అనే మాట ఎదురు వినిపించదు. ఎలాంటి పనైనా కార్యాలయం సిబ్బందితో చేయించుకోవచ్చు. ఇలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాపట్ల జిల్లా కర్లపాలెం డిప్యూటీ ఎమ్మార్వో శ్రీదేవిపై విమర్శల వర్షం కురుస్తోంది. తన కారును వీఆర్ఏతో కడిగించారు. ప్రజలకు సేవ చేయాల్సిన వీఆర్ఏతో సొంత పనులు చేయించుకోవడాన్ని తప్పుబడుతున్నారు. ఎంత పైఅధికారిణి అయితే మాత్రం కింద స్థాయి సిబ్బందిని బానిసగా మార్చుతారా అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. వీఆర్ఏతో కారు కడిగించిన డిప్యూటీ ఎమ్మార్వోపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కొందరు అధికారుల తీరు మారాలని పలువురు సూచిస్తున్నారు.

Next Story