- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నరసరావుపేటలో దారుణం.. కడుపులో బ్లేడు వదిలేసిన వైనం
గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచే అత్యంత దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచే అత్యంత దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఓ మహిళ తీవ్రమైన కడుపునొప్పి కారణంగా స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆ మహిళకు అక్కడి వైద్యులు శస్త్రచికిత్స (Operation) నిర్వహించారు. ఈ క్రమంలో అత్యంత ప్రమాదకరమైన వస్తువును రోగి కడుపులోపలే వదిలేసినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ తర్వాత కూడా మహిళకు కడుపునొప్పి తగ్గకపోగా, అది రోజురోజుకూ మరింత తీవ్రంగా మారిందని. నొప్పి భరించలేక మహిళ కుటుంబసభ్యులు ఆమెను వేరే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ జరిపిన సమగ్ర స్కానింగ్ (Scanning) పరీక్షల్లో అసలు విషయం బయటపడింది. ఆపరేషన్ చేసిన చోట ఒక బ్లేడు ముక్కను వైద్యులు కడుపులోపలే వదిలేసినట్లుగా వైద్య పరీక్షల్లో వెల్లడైందని. దాని వల్లే మహిళకు కడుపు నొప్పి తీవ్రమైనట్లు వైద్యులు గుర్తించారు. ఈ విషయం తెలియగానే రోగి కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే ఇంత ఘోరమైన నిర్లక్ష్యానికి పాల్పడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ దారుణ ఘటన నేపథ్యంలో మహిళ కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులైన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, అలాగే బాధిత మహిళకు తక్షణమే మెరుగైన వైద్యం అందించేలా, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటనపై అధికారుల స్పందన కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు. వైద్యుల తీరుపై ప్రజలు, సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలను గుప్పిస్తున్నారు.






