- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆంజనేయ స్వామి ఆభరణాల చోరీ.. నిందితుడి అరెస్ట్, గోల్డ్ సీజ్
భక్తితో నమ్మకంగా కొలిచే ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన వెండి, బంగారు ఆభరణాల దొంగతనం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని ఎడ్లపాడు ఎస్సై శివరామకృష్ణ సిబ్బంది అరెస్ట్ చేశారు. ..

X
దిశ, యడ్లపాడు: యడ్లపాడు ఆంజనేయ స్వామి వెండి, బంగారు ఆభరణాలు చోరీ జరిగింది. ఈ కేసులో పోలీసులు వ్యక్తిని అరెస్ట్ చేశారు. 230 గ్రాముల వెండి‑బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. యడ్లపాడుకు చెందిన మద్దుల రమణారావును తెనాలిలో అరెస్ట్ చేశారు. నిందితుడు దొంగిలించిన ఆస్తులను కనమర్లపూడిలోని శ్రీహరిరావు ఇంటి వద్ద దాచినట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రమణారావును రిమాండ్‌కు తరలించారు.
ఆభరణాల వివరాలు
వెండి వస్తువులు (మొత్తం 216 గ్రాములు): తమలపాకుల తోరణం – 142 గ్రాములు, నామాలు, నేత్రాలు – 42 గ్రాములు, రెండు జతల ఉత్తర జంద్యాలు – 14 గ్రాములు, మెట్టెలు, పిల్లేళ్లు – 20 గ్రాములు.
బంగారు ఆభరణాలు: మంగళసూత్రం – 4 గ్రాములు, రెండు జతల బంగారు నేత్రాలు – 10 గ్రాములు.
Next Story






