- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘లవ్ క్యాష్’ అని పెడితే బాగుంటుంది: లోకేశ్ పేరుపై అంబటి రాంబాబు పంచ్‌లు
రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా గుంటూరులో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) ధరలకు నిరసనగా గుంటూరు(Guntur)లో వైసీపీ(Ycp) ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minsiter Ambati Rambabu) నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఈ నిరసనలో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వయంగా రిక్షా తొక్కి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద ఈ శాంతియుత నిరసన కార్యక్రమం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఇంధన ధరలను విపరీతంగా పెంచేసి సామాన్యుడి నడుం విరుస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోకేశ్ పేరుపై అంబటి పంచ్‌లు
ఇదే వేదికపై మంత్రి నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ అంబటి రాంబాబు పంచ్‌లు వేశారు. లోకేష్ పేరును 'లోకేష్' అని కాకుండా 'లవ్ కాష్' అని పెడితే చాలా బాగుంటుందని ఎద్దేవా చేశారు. అంతేకాదు లోకేష్ తన చిన్నప్పుడు అన్నప్రాసన రోజే చేత్తో క్యాష్ పట్టుకున్నాడట, మరి ఇప్పుడు మాత్రం ఏం చేస్తాడు అంటూ సెటైర్లు వేశారు.






