- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరంజీవి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి: అంబటి రాంబాబు
చిరంజీవి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి: అంబటి రాంబాబు

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad) సినిమా సోమవారం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా హిట్ కావాలని సినీ, రాజకీయ ప్రముఖులు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘నా అభిమాన నటుడు చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సూపర్ డూపర్ హిట్ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా.’ అని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు(Ycp Leader Ambati Rambabu) అన్నారు. గతంలో చిరంజీవితో దిగిన ఫొటోను ఆయన షేర్ చేశారు.
కాగా చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అంబటి రాంబాబు పలుమార్లు తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే అన్న చిరంజీవిపై చాలా సందర్భాల్లో పొగడ్తల వర్షం కురిపించారు. ఇప్పటికీ చిరంజీవి తమ వాడేనని కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. చిరంజీవి చేపట్టిన కొన్ని కార్యక్రమాలను సైతం ఆయన మెచ్చుకున్నారు.






