అమరావతిలో మరో కీలక ఘట్టం.. గర్వించదగ్గ రీతిలో నిర్మాణాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-26 14:21:10  IST  )

రాజధాని అమరావతిలో ఐకానిక్ అసెంబ్లీ భవన నిర్మాణ పనుల్లో వేగంపుంజుకుంది. అసెంబ్లీ సెంట్రల్ హాల్‌కు సంబంధించిన పైలింగ్ పనులను గురువారం మంత్రి నారాయణ ప్రారంభించారు...

అమరావతిలో మరో కీలక ఘట్టం..  గర్వించదగ్గ రీతిలో నిర్మాణాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాజధాని అమరావతి(Amaravati)లో ఐకానిక్ అసెంబ్లీ భవన నిర్మాణ(Construction of the Iconic Assembly Building) పనుల్లో వేగంపుంజుకుంది. అసెంబ్లీ సెంట్రల్ హాల్‌(Assembly Central Hall)కు సంబంధించిన పైలింగ్ పనులను గురువారం మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ భవనాన్ని అత్యాధునిక హంగులతో రాష్ట్ర వైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి ప్రకటించారు. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ అసెంబ్లీ భవనం ఏపీ గర్వించదగ్గ రీతిలో నిలవబోతోందని మంత్రి నారాయణ తెలిపారు.

ఈ భవనం ప్రత్యేకత ఏమిటంటే..

సుమారు 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, బీ+జీ+3 (బేస్‌మెంట్, గ్రౌండ్ ప్లస్ త్రీ) అంతస్తులతో ఈ భవనం రూపుదిద్దుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. దీనిపై 250 మీటర్ల ఎత్తులో ఒక భారీ టవర్‌ నిర్మాణం ప్రత్యేకతంగా నిలుస్తుందని చెప్పారు. సందర్శకులు ఈ టవర్‌పైకి వెళ్లి రాజధాని అమరావతి అందాలను వీక్షించేలా డిజైన్ చేశామని తెలిపారు. మొత్తం భవనాన్ని నాలుగు భాగాలుగా విభజించి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

రాజధాని భద్రతపై స్పందించిన మంత్రి

నిర్మాణ విశేషాలతో పాటు రాజధాని భద్రతపై కూడా మంత్రి స్పందించారు. ఇటీవల అమరావతి పరిధిలో జరిగిన అగ్నిప్రమాదాల ఘటనలపై ఇప్పటికే పోలీస్ విచారణ సాగుతోందని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Next Story