అమరావతి అగ్నిప్రమాదం.. పోలీసుల అదుపులో వాచ్‌మెన్‌

by Ramesh Naini |

అమరావతి అగ్నిప్రమాదం నేపథ్యంలో సాంకేతిక ఆధారాల మేరకు వాచ్‌మెన్‌ రామ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

అమరావతి అగ్నిప్రమాదం.. పోలీసుల అదుపులో వాచ్‌మెన్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ రాజధాని అమరావతిలోని రాయపూడి సమీపంలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనలో తుళ్లూరు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాల మేరకు వాచ్‌మెన్‌ రామ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ నిల్వ ఉంచిన పైపులు మంటలకు దగ్ధమైన విషయం తెలిసిందే. రాజధాని పనులు వేగంగా జరుగుతున్న తరుణంలో.. ఇలా వరుస అగ్నిప్రమాదాలు జరగడం వెనుక కుట్ర కోణం ఉందంటూ సీఎం చంద్రబాబు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసుల విచారణకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story