గాంధీజీ ఆశయ సాధనే నిజమైన నివాళి : చీఫ్ విఫ్ జీవీ ఆంజనేయులు

by Thanuru Gopichand |

సత్యం, అహింసలే గాంధీజీ ఆయుధాలు. యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపు.

గాంధీజీ ఆశయ సాధనే నిజమైన నివాళి : చీఫ్ విఫ్ జీవీ ఆంజనేయులు
X

దిశ, వినుకొండ : సత్యం, అహింస అనే ఆయుధాలతో బ్రిటీష్ వారి కబంధహస్తాల నుంచి భారత జాతికి విముక్తి కల్పించిన మహనీయుడు మహాత్మాగాంధీ అని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కొనియాడారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని వినుకొండ పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం జీవీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీజీ చేసిన అలుపెరగని పోరాటాన్ని జాతి ఎప్పటికీ మరువలేదన్నారు. నాడు బాపూజీ చూపిన శాంతి మార్గం, ఆయన ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story