- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీ నేతలు, కార్యకర్తలతో 'కాఫీ కబుర్లు'.. ఫుల్ ఖుష్ అయిన సీఎం చంద్రబాబు
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల శిక్షణా శిబిరం నిర్వహించారు..

దిశ, వెబ్ డెస్క్: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల శిక్షణా శిబిరం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో 'కాఫీ కబుర్లు' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ హయాంలో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో జరిగిన శిక్షణా శిబిరాల విషయాలను ఈ సందర్భంగా నేతలతో పంచుకున్నారు. కోటి మంది పార్టీ క్రియాశీలక సభ్యులతో దేశంలో బలమైన పార్టీగా ఉన్న తెలుగుదేశం సిద్ధాంతాలను ప్రజల వద్దకు మరింతగా తీసుకువెళ్లేందుకు ఈ శిక్షణా కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, పార్టీ విధానాలు, ప్రభుత్వ ఆలోచనలు, విజయాలు, నాయకత్వ లక్షణాలు, సంక్షేమ పథకాల అమలు, కార్యకర్తలకు గౌరవం, అందలం వంటి అంశాలపై వారితో చర్చించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. గ్రామస్థాయిలో అన్ని పరిస్థితులు, మంచి చెడులు తెలుసుకోవడానికి కూడా ఈ కార్యక్రమం మంచి వేదిక అవుతుందన్నారు. కార్యకర్తే అధినేత అనే సిద్దాంతంతో పనిచేసే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలను కలుసుకునే ప్రతి సందర్భం తనకు ప్రత్యేకమేనని చెప్పారు. కాఫీ కబుర్లు సమావేశం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.






