ఉండవల్లిలో రెండు బస్సులు ఢీ.. ముందు భాగాలు నుజ్జునుజ్జు

by Vemula.Srinu Prasad |

తాడేపల్లి నియోజకవర్గం పరిధి ఉండవల్లి గుహల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును అమరావతిలోని ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు బలంగా ఢీకొంది....

ఉండవల్లిలో రెండు బస్సులు ఢీ.. ముందు భాగాలు నుజ్జునుజ్జు
X

దిశ, గుంటూరు ప్రతినిధి: తాడేపల్లి నియోజకవర్గం పరిధి ఉండవల్లి గుహల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును అమరావతిలోని ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు బలంగా ఢీకొంది. ఈ ఘటనతో రెండు వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదంలో ఆర్టీసీ ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌ను క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రైవేట్ కాలేజీ బస్సు‌లో విద్యార్థులు ఎవరు లేకపోవడం పెను ప్రమాదం తప్పింది

Next Story