- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎస్ సునీల్ నాయక్‌కు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కు గుంటూరు మొబైల్ కోర్టు షాకిచ్చింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: గతప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసి కస్టడీలో టార్చర్ చేసిన కేసులో బిహార్ క్యాడర్ కు చెందిన సునీల్ నాయక్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ మేరకు గుంటూరు మొబైల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణకు రావాలని గుంటూరు పోలీసులు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇటీవలే ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు పాట్నాకు వెళ్లగా.. ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసేందుకు పాట్నా హైకోర్టు నిరాకరించింది. దీంతో గుంటూరు పోలీసులు స్థానిక మొబైల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు.. అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ సునీల్ నాయక్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు హైకోర్టు ధర్మాసనం విచారించనుంది. పిటిషన్ పై కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో తెలియాల్సి ఉంది.






