Guntur Mayor: ఈ నెల 28న గుంటూరు మేయరు ఎన్నిక

by Thanuru Gopichand |

ఈ నెల 28వ తేదీన మేయరు, మున్సిపల్​చైర్మన్ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్​నోటిఫికేషన్ జారీ చేసింది.

Guntur Mayor: ఈ నెల 28న గుంటూరు మేయరు ఎన్నిక
X

దిశ, డైనమిక్ ​బ్యూరో: ఈ నెల 28వ తేదీన మేయరు, మున్సిపల్​చైర్మన్ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్​నోటిఫికేషన్ (Election notification)​జారీ చేసింది. గుంటూరు మేయరు ఎన్నికకు నోటిఫికేషన్​ ఇచ్చింది. అదే విధంగా గతంలో వాయిదా పడిన కుప్పం, తుని, పాలకొండ పురపాలక చైర్మన్ల ఎన్నికలు కూడా నిర్వహించనురన్నారు. గుంటూరు మేయరుగా ఉన్న వైసీపీ కి చెందిన కావటి మనోహర్‌నాయుడు గత మార్చి నెలలో తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఎన్నిక అనివార్యం అయింది. కుప్పం, తుని, పాలకొండ పురపాలక చైర్మన్ల ఎన్నికలు గతంలో నిర్వహించాల్సి ఉండగా.. కోరం లేకపోవడం, మరి కొన్ని కారణాలతో అవి వాయిదా పడ్డాయి. దీంతో మరో సారి నోటిఫికేషన్​జారీ చేశారు.

Next Story