విద్యార్థుల భవిష్యత్‌తో ఆక్స్‌ఫర్డ్ చెలగాటం.. నకిలీ జేఈఈ అడ్మిట్ కార్డులతో మోసం

by Naga Rani Yarlagadda |

జేఈఈ, నీట్ కోసం ఆక్స్ ఫర్డ్ కాలేజీని నమ్మిన విద్యార్థులను.. సంస్థ నట్టేట ముంచింది. నకిలీ అడ్మిట్ కార్డులతో అసలు బండారం బయటపడింది.

విద్యార్థుల భవిష్యత్‌తో ఆక్స్‌ఫర్డ్ చెలగాటం.. నకిలీ జేఈఈ అడ్మిట్ కార్డులతో మోసం
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం మెరుగైన మార్గం చూపించాల్సిన దేవాలయాల్లాంటి విద్యాసంస్థలే.. లాభార్జనే ధ్యేయంగా డబ్బులు దండుకుని దారితప్పుతున్నాయి. తాజాగా గుంటూరులోని ఆక్స్ ఫర్డ్ కాలేజీ.. విద్యను వ్యాపారంగా మార్చి.. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాయి. కాలేజీ స్టూడెంట్స్ ను మోసం చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జేఈఈ కోసం ఫీజులు కడితే.. ఇప్పుడు తమకు ఇచ్చిన హాల్ టికెట్లు నకిలీవని తేలిందని విద్యార్థులు వాపోయారు. అంతేకాకుండా నీట్ ఎగ్జామ్ కోసం డబ్బులు తీసుకుని అప్లికేషన్ కూడా పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కెరీర్లో రెండు సంవత్సరాలు వృథా అయిపోయాయని వాపోతున్నారు. తమ తల్లిదండ్రులతో కలిసి కాలేజీ ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేయాలని కాలేజీలోని డీన్ మురళీకృష్ణ పీఏ మూర్తి అనే వ్యక్తికి రూ.1000 చొప్పున చెల్లించారు. ఆ తర్వాత వారందరికీ అడ్మిట్ కార్డులిచ్చారు. బుధవారం పరీక్షకు వెళ్లిన విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. పరీక్ష కేంద్రంలో వారందరినీ అడ్డుకోవడంతో ఈ బాగోతం బయటపడింది. విషయం కలెక్టర్ సాయికాంత్ వర్మ దృష్టికి చేరడంతో.. ఇంటర్ బోర్డు, ఆర్డీఓ, ఆర్జేడీ, ఆర్ఐఓకు విచారణ చేయాలని ఆదేశించారు. అక్కడికి వెళ్లిన అధికారులు.. ఆ కాలేజీకి ఎలాంటి అనుమతులు లేవని నిర్ధారించారు.

Next Story