- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరు : మంగళగిరిలో దారుణం
గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో (Mangalagiri) దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. సభ్య సమాజం తల దించుకునేలా బాలికపై లైంగిక దాడి జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో (Mangalagiri) దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. సభ్య సమాజం తల దించుకునేలా బాలికపై లైంగిక దాడి జరిగింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులపై నేరాల ఘటనలు వెలుగు చూస్తున్నాయి. పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మంగళగిరిలో బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం మంగళగిరి పరిధిలో ఓ నలుగురు యువకులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మాయ మాటలు చెప్పి బాలికను ఒంటిరిని చేశారు. తరువాత ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘోరమైన ఘటనలో బాలిక గాయపడింది. తర్వాత ఈ సంగతి బయటికి చెప్పినా, పోలీసులకు చెప్పినా చంపేస్తామని నిందితులు బెదిరింపులకు దిగారు. దీంతో బాధితురాలు బాలిక, ఆమె కుటుంబ సభ్యులు ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉండి పోయింది. బాలిక అవస్థను చూసిన కుటుంబ సభ్యులు ఆమెను అడుగగా.. అసలు విషయం బయటపడింది. దీంతో బాలిక తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.






