నన్ను అసభ్య పదజాలంతో దూషించారు..కన్నీళ్లు పెట్టుకున్న జడ్పీ చైర్‌పర్సన్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-12 15:17:28  IST  )

గుడివాడ‌లో నేడు వైసీపీ, కూట‌మి పోటాపోటీగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాయి. ఈ క్ర‌మంలో అక్క‌డ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. కాగా వైసీపీ నిర్వ‌హించిన పార్టీ కార్య‌క్ర‌మానికి వెళుతుండ‌గా

నన్ను అసభ్య పదజాలంతో దూషించారు..కన్నీళ్లు పెట్టుకున్న  జడ్పీ చైర్‌పర్సన్
X

దిశ‌, వెబ్ డెస్క్: గుడివాడ‌లో నేడు వైసీపీ, కూట‌మి పోటాపోటీగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాయి. ఈ క్ర‌మంలో అక్క‌డ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. కాగా వైసీపీ నిర్వ‌హించిన పార్టీ కార్య‌క్ర‌మానికి వెళుతుండ‌గా త‌న‌ను అడ్డుకుని దాడి చేశార‌ని ఆ పార్టీ నాయ‌కురాలు, గుడివాడ జ‌డ్పి చైర్ పర్సన్ ఉప్పాల హారిక ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గుడివాడ ఎమ్మెల్యే ప్రోద్బ‌లంతోనే దాడి జరిగిందని ఆరోపించారు. కారులో ఉన్న తమను చంపడానికి ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడితో భయపడిపోయి తన భర్త కారు దిగలేదని చెప్పారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని కారు అద్దాలు కూడా ధ్వంసం చేశారని తెలిపారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. టీడీపీ గుండాలు దాడి చేస్తుంటే పోలీసులు పట్టించుకోకుండా వారికి సహకరించినట్టు అనిపించిందని చెప్పారు.

Next Story