విశాఖ డ్రగ్స్ కేసు.. వారిని తప్పించేందుకు రంగంలోకి ఎమ్మెల్యే, ఎంపీ : గుడివాడ అమర్నాథ్

by Naga Rani Yarlagadda |

విశాఖలో కలకలం రేపిన డ్రగ్స్ కేసుపై (Vizag Drugs Case) మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudiwada Amarnath) సంచలన వ్యాఖ్యలు చేశారు.

విశాఖ డ్రగ్స్ కేసు.. వారిని తప్పించేందుకు రంగంలోకి ఎమ్మెల్యే, ఎంపీ : గుడివాడ అమర్నాథ్
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో కలకలం రేపిన డ్రగ్స్ కేసుపై (Vizag Drugs Case) మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudiwada Amarnath) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో డ్రగ్స్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకున్నట్లయింది. ఈ డ్రగ్స్ కేసులో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువ ఎంపీ ఉన్నాడని ఆయన విమర్శించారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన అక్షయ్ వర్మతో పాటు కోనేరు రఘు, గౌతమ్ జైన్ ఉన్నారని ఆరోపించారు. వారిద్దరినీ తప్పించేందుకు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, బండారు సత్యనారాయణ, ఎంపీ భరత్ రంగంలోకి దిగారన్నారు. నిజనిజాలేంటో తెలియాలంటే అక్షయ్ వర్మ కాల్ రికార్డింగ్స్ బయటపెట్టాలని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు.

ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ నెల 5న అక్షయ్ కుమార్ అనే యువకుడి వద్ద కొకైన్ లభ్యమైంది. అతని వద్ద డాక్టర్ కమ్మెళ్ల శ్రీకృష్ణచైతన్య (34) డ్రగ్స్ కొన్నట్లు సాక్ష్యాలు లభ్యమవ్వడంతో.. రెండ్రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్యుడితో పాటు రఘు, గౌతమ్ అనే ఇద్దరు వ్యక్తులకు కూడా డ్రగ్స్ అమ్మినట్లు అక్షయ్ కుమార్ చెప్పడంతో వారికి కూడా వైద్య పరీక్షలు చేసి, చర్యలు తీసుకుంటామని ఏసీప తెలిపారు.

Next Story