దుబాయ్ శ్రీనులా సింగపూర్ చంద్రబాబు అనాలి: గుడివాడ అమర్నాథ్

by Ajay Maddhiboyina |

దుబాయ్ శ్రీనులా సింగ‌పూర్ చంద్ర‌బాబు అనాలి అంటూ మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ ఎద్దేవా చేశారు. నాలుగు సార్లు సింగ‌పూర్ వెళ్లిన చంద్ర‌బాబు రాష్ట్రానికి ఎన్నిపెట్టుబ‌డులు

దుబాయ్ శ్రీనులా సింగపూర్ చంద్రబాబు అనాలి: గుడివాడ అమర్నాథ్
X

దిశ‌, వెబ్ డెస్క్: దుబాయ్ శ్రీనులా సింగ‌పూర్ చంద్ర‌బాబు అనాలి అంటూ మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ ఎద్దేవా చేశారు. నాలుగు సార్లు సింగ‌పూర్ వెళ్లిన చంద్ర‌బాబు రాష్ట్రానికి ఎన్నిపెట్టుబ‌డులు తెచ్చార‌ని ప్ర‌శ్నించారు. తీసుకువ‌చ్చిన పెట్టుబ‌డి కంటే ఇక్క‌డ సంపాదించిన అవినీతి సొమ్మును దాచుకునేందుకే చంద్ర‌బాబు సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న అంటూ విమ‌ర్శించారు. ఈశ్వరన్ తో ములాఖత్ అయ్యేందుకే సింగ‌పూర్ వెళ్లారా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక‌సారి దావోస్, ఒక‌సారి సింగ‌పూర్, ఒక‌సారి కొరియా... మీరు మీ బ్రాండ్ ఇమేజ్ పెచుకునేందుకే సింగ‌పూర్ వెళ్లారా అని నిల‌దీశారు.

అక్క‌డ‌కు వెళ్లిన త‌ర‌వాత కూడా అమ‌రావ‌తి త‌ప్ప మిగిలిన రాష్ట్రం గుర్తుకు రాద‌ని ఆరోపించారు. అవినీతి సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికే చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారని విమ‌ర్శ‌లు కురిపించారు. నాలుగుసార్లు ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని న‌మ్మి ఓట్లు వేస్తే ఇచ్చిన హామీలు నిల‌బెట్టుకుందామ‌నే ఆలోచ‌న ఎప్పుడూ లేద‌ని అన్నారు. విశాఖలో విలువైన భూములను కారు చౌకగా ఇచ్చే బదులు అమరావతిలో పెట్టుబడులు పెట్టమనండి అంటూ మండిపడ్డారు.

Next Story