- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GST Notices: సెలూన్ షాపు నిర్వాహకుడికి మైండ్ బ్లాంక్.. రూ.72 లక్షల జీఎస్టీ నోటీసు!
కత్తెర పడితే కానీ పూట గడవని ఓ సెలూన్ షాపు నిర్వాహకుడికి రూ.72 లక్షల జీఎస్టీ కట్టాలంటూ అధికారులు నోటీసుల పంపడం హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: ఓ సామాన్య సెలూన్ నిర్వాహకుడికి జీఎస్టీ (GST) అధికారులు ఊహించని షాకిచ్చారు. ఏకంగా రూ.72 లక్ష పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపడం స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ (Vijayawada)కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి గత కొంతకాలంగా ఓ చిన్న సెలూన్ సెంటర్‌ను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజువారీ కత్తెర పట్టి సంపాదించే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆయనకు, జీఎస్టీ శాఖ నుంచి వచ్చిన నోటీసు చూసి కళ్లు బైర్లు కమ్మాయి. ఆ నోటీసులలో శ్రీనివాసరావు భారీ ఎత్తున వ్యాపార లావాదేవీలు నిర్వహించారని, అందుకు సంబంధించి సుమారు రూ.72 లక్షల మేర జీఎస్టీ బకాయి పడ్డారని అధికారులు పేర్కొన్నారు.
లబోదిబోమంటున్న బాధితుడు
రోజూ కష్టపడితేనే కడుపు నిండని పరిస్థితి తనదని సెలూన్ షాపు నిర్వహకుడు లబోదిబోమంటున్నాడు. రూ.కోట్లలో వ్యాపారం చేయడం అంటే ఏమిటో కూడా తనకు తెలియదని వావోతున్నాడు. ఇంత పెద్ద మొత్తంలో పన్ను కట్టాలంటే నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను కలిసి తన గోడును వెళ్లబోసుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. అయితే, ఇటీవల కాలంలో సామాన్యుల కేవైసీ (KYC) పత్రాలను దొంగిలించి, వాటితో అక్రమ లావాదేవీలు జరపడం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఎవరైనా తమ ఆధార్, పాన్ కార్డు వివరాలను అపరిచితులకు ఇచ్చేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.






