- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భౌగోళిక వారసత్వ ప్రదేశంగా బెలూం గుహలు.. GSI గుర్తింపు
ఏపీ(Andhra Pradesh)లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI) అధికారిక గుర్తింపు ఇచ్చింది

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI) అధికారిక గుర్తింపు ఇచ్చింది. ఈ గుర్తింపుతో బెలూం గుహలు భారత్‌లోని ప్రాముఖ్యమైన పర్యాటక ప్రాంతాల జాబితాలో స్థానం సంపాదించాయి. దేశంలోనే అత్యంత పొడవైన గుహలుగా ఇప్పటికే బెలూం గుహలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ప్రతి సంవత్సరం సుమారుగా రెండు లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తున్నారు.
భౌగోళిక వారసత్వ జాబితాలో ప్రఖ్యాత బెలూం గుహలకు గుర్తింపు దక్కడంపై ఏపీ పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ‘‘పురాతన సంస్కృతి నిలయాలు ఈ బెలూం గుహలు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI) ప్రకటనతో పర్యాటకంగా మరింత ప్రాచుర్యం లభిస్తుంది. జీఎస్ఐ జాబితాలో చోటు దక్కడం వల్ల బెలూం గుహలు మరింత అభివృద్ధికి నోచుకోనున్నాయి. ప్రపంచలో రెండోది, దేశంలోనే పొడవైన అంతర్భాగ గుహలుగా బెలూం గుహలు ప్రసిద్ధి. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా మరింత ప్రచారం కల్పిస్తామని’’ మంత్రి దుర్గేష్ ఓ ప్రకటనలో తెలిపారు.
బెలూం గుహలు..
బెలూం గుహలో 40 మెట్లు దిగిన తర్వాత 10 మీటర్ల లోతులో నుంచి 30 మీటర్ల లోతు వరకు సొరంగాలు ఉన్నాయి. ఇందులో కొన్ని ఇరుకుగా, మరికొన్ని విశాలమైన గదుల మాదిరిగా ఉంటుంది. అంతేకాదు కొన్నిచోట్ల స్టాట్రిక్ లైట్లు, స్మాల్ గేట్లు అని పిలిచే స్పటికాకృతులు ఏర్పడినట్లు చెబుతారు. ఈ తరుణంలో కృత్రిమ శిలల ఆకృతులను బట్టి కొన్ని ప్రదేశాలకు పేర్లు కూడా పెట్టారు. వెయ్యి పడగలు, కోటి లింగాలు, ఐరావతం, ఊడలమర్రి, మాయా మందిరం, గాన ధ్యాన మందిరం వంటి పేర్లతో పిలుస్తారు. అయితే ఈ బెలూం గుహలలో మరో అద్భుతమైన ప్రదేశాన్ని సందర్శించవచ్చు. ఈ గుహల చివరి వరకు వెళ్తే.. పాతాళగంగ అనే నీటి మడుగు, రాతిలో ఉన్న శివలింగం కనిపిస్తాయి.






