Group-2 Mains: ఏపీపీఎస్సీ సంచలన నిర్ణయం.. యథావిధిగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష

by Kema Shiva Kumar |

గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష (Group-2 Exam Mains)ను వాయిదా వేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు (Candidates) ఆందోళన చేస్తున్న వేళ ఏపీపీఎస్సీ (APPSC) సంచలన ప్రకటన చేసింది.

Group-2 Mains: ఏపీపీఎస్సీ సంచలన నిర్ణయం.. యథావిధిగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష (Group-2 Exam Mains)ను వాయిదా వేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు (Candidates) ఆందోళన చేస్తున్న వేళ ఏపీపీఎస్సీ (APPSC) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రేపు గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని ప్రకటించింది. అదేవిధంగా ఉదయం 10గంటల నుంచి 12.30గంటల వరకు పేపర్-1 (Paper-1) పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్‌-2 (Paper-2) పరీక్ష కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. పరీక్ష రాస్తున్న అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు 15 నిమిషాలు ముందుగానే సూచించారు. గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేశారంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను అభ్యర్థులు నమ్మొద్దని ఏపీపీఎస్సీ (APPSC) స్పష్టం చేసింది.

కాగా, రోస్టర్‌ (Roster)లో లోపాలు సరి చేయాలంటూ శుక్రవారం అభ్యర్థులు నిరసనలు చేపట్టారు. అదేవిధంగా గ్రూప్-2 మెయిన్స్ (Grou-2 Mains) పరీక్షను కూడా వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అయితే, పరీక్ష రద్దుకు కొందరు అభ్యర్థులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు (High Court)కు వెళ్లగా సింగిల్ జడ్జ్ ధర్మాసనం పరీక్షల వాయిదాకు నిరాకరించింది.

Next Story