రాష్ట్రంలో గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం.. సర్వం సిద్ధం చేసిన అధికారులు

by Kema Shiva Kumar |

రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష (Group-1 Mains Exams)లు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి.

రాష్ట్రంలో గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం.. సర్వం సిద్ధం చేసిన అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష (Group-1 Mains Exams)లు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (Andhra Pradesh Public Service Commission) నిర్వహిస్తున్న ఈ పరిక్షలు నేటి నుంచి మే 9 కొనసాగుతాయి. ఈ మేరకు అధికారులు మొత్తం 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో విశాఖపట్నం (Vishakhapatnam)లో 2, విజయవాడ (Vijayawada) 6, తిరుపతి (Tirupati) 3, అనంతపురంలో 2 ఉన్నాయి. మొత్తం ఉన్న 89 పోస్టుల కోసం ప్రిలిమ్స్‌ అర్హత సాధించిన 4,496 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు కొనసాగుతాయి.

అయితే, పరీక్షకు హాజరయ్యే వారిని ఎగ్జామ్ సెంటర్లలోకి ఉదయం 9.45కే అనుమతించారు. అభ్యర్థులను తమ వెంట ఐదైన ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, హాల్ టికెట్ (Hall Ticket), బాల్ పాయింట్ పెన్ మాత్రమే అనుమతించారు. నేటి పరీక్షలో భాగంగా తెలుగు క్వాలిఫైయింగ్‌ నేచర్‌ (తెలుగు), 4 తేదీన క్వాలిఫైయింగ్‌ నేచర్‌ (ఇంగ్లీష్‌), 5న పేపర్‌-1, 6న పేపర్‌-2, 7న పేపర్‌-3, 8న పేపర్‌-4, 9వ తేదీన పేపర్‌-5 పరీక్షలు నిర్విహించనున్నారు. ఈ మేరకు పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ (Anuradha), సెక్రటరీ రాజాబాబు (Raja Babu) ఆకస్మికంగా తినిఖీ చేశారు.

Next Story