స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలి: CM Jagan tweeted

by Chukka Sudharani |   (  Updated:2023-01-21 14:16:28  IST  )

'యువత దేశానికి వెన్నెముక, వారు సాధించలేనిది ఏదీ లేదు' అన్న స్వామి వివేకానంద మాటలను స్ఫూర్తిగా తీసుకుని యువత తమ లక్ష్యాలను సాధించాలని

స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలి: CM Jagan tweeted
X

దిశ, డైనమిక్ బ్యూరో : 'యువత దేశానికి వెన్నెముక, వారు సాధించలేనిది ఏదీ లేదు' అన్న స్వామి వివేకానంద మాటలను స్ఫూర్తిగా తీసుకుని యువత తమ లక్ష్యాలను సాధించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వివేకానందుని చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుష్పాంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు సైతం ఉన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ''యువత దేశానికి వెన్నెముక, వారు సాధించలేనిది ఏదీ లేదు' అన్న స్వామి వివేకానంద గారి మాటలను స్ఫూర్తిగా తీసుకుని లక్ష్య సాధనలో అంకిత భావంతో మనమందరం ముందడుగులు వేయాలి. జాతీయ యువజనోత్సవ సందర్భంగా యువత అందరికీ శుభాకాంక్షలు' అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Also Read...

తిరుమల శ్రీవారిని భక్తులకు దూరం చెయ్యాలి అనుకుంటున్నారా?

Next Story