- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే యార్లగడ్డకు ఊరట.. అమెరికా పర్యటనకు గ్రీన్ సిగ్నల్
గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసుల ప్రభావం ఇంకా టిడిపి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అమెరికా పర్యటనకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ...

దిశ, ఏపీ బ్యూరో: గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసుల ప్రభావం ఇంకా టిడిపి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అమెరికా పర్యటనకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమెరికాలోని తన వ్యాపార కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు రెండు సంవత్సరాలుగా ఆయన చేస్తున్న ప్రయత్నాలకు కేసులు అడ్డంకిగా మారాయి. కోర్టులు అనుమతులు ఇవ్వకపోవడంతో ఆయన పర్యటన వాయిదా పడుతూ వచ్చింది.
అమెరికా పర్యటనకు అనుమతి
తాజాగా మచిలీపట్నం ఎస్సీ, ఎస్టీ జిల్లా కోర్టు పలు కఠిన షరతులతో యార్లగడ్డకు అమెరికా పర్యటనకు అనుమతి మంజూరు చేసింది. నాలుగురు జామీనుదారులు ఇవ్వడంతో పాటు, అమెరికా పర్యటన పూర్తి వివరాలను ముందుగానే కోర్టుకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించింది. అలాగే విదేశీ పర్యటన సమయంలో ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్ ఆన్‌లో ఉంచాలని, జూలై 15, 2026లోపు తప్పనిసరిగా భారత్‌కు తిరిగి రావాలని కోర్టు స్పష్టం చేసింది. అనుమతులను పొడిగించరాదని, విధించిన షరతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదని హెచ్చరించింది. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత వారం రోజుల్లోపు కోర్టులో హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
స్వల్ప షరతులతో..
ఇకపోతే, విజయవాడ కోర్టు స్వల్ప షరతులతో అనుమతి ఇవ్వగా, బందరు కోర్టు మరింత కఠిన షరతులు విధించడం గమనార్హం. కోర్టుల నుంచి అనుమతులు లభించడంతో ఈ నెల చివరి వారంలో అమెరికా పర్యటనకు వెళ్లేందుకు యార్లగడ్డ వెంకట్రావు సన్నాహాలు ప్రారంభించారు.






