- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Junior college:రాష్ట్రంలో 53 నూతన జూనియర్ కాలేజీలకు గ్రీన్‌సిగ్నల్
by Jakkula.Mamatha |
రాష్ట్రవ్యాప్తంగా 53 నూతన జూనియర్ కాలేజీల(New Junior Colleges) ఏర్పాటుకు ప్రభుత్వం(Government) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా 53 నూతన జూనియర్ కాలేజీల(New Junior Colleges) ఏర్పాటుకు ప్రభుత్వం(Government) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్తగా 53 జూనియర్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 37 మండలాలు, రెండు పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్(Kona Shasidhar) ఉత్తర్వులు జారీ చేశారు. 37 మండలాల్లో 47 కళాశాలలు, రెండు పట్టణ ప్రాంతాల్లో ఆరు కళాశాలలు ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఇంటర్ బోర్డు(Inter Board) కార్యదర్శి కృతికా శుక్లా(Kritika Shukla) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ ఆమోదించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 480 జూనియర్ కాలేజీలున్నాయి.
Next Story






