Graduate MLC vote: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ ఓటు చెల్లదు..

by Thanuru Gopichand |

గ్రాడ్యుయేట్​ఎన్నికలు.. జనరల్​ఎన్నికల్లా కాదు.. ఓటరు నమోదు నుంచి చివరికి ఓటు వేసే వరకు అంతా డిఫరెంట్ గానే ఉంటుంది.

Graduate MLC vote: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ ఓటు చెల్లదు..
X

దిశ, డైనమిక్​ బ్యూరో: గ్రాడ్యుయేట్​ ఎన్నికలు.. జనరల్​ఎన్నికల్లా కాదు.. ఓటరు నమోదు నుంచి చివరికి ఓటు వేసే వరకు అంతా డిఫరెంట్ గానే ఉంటుంది. ఓటరు నమోదుకు కనీసం డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అలా అయితేనే ఓటు హక్కు వస్తుంది. వెరిఫికేషన్ అనంతరం ఓటు హక్కు వస్తుందనే విషయం తెలిసిందే. అయితే ఈ గ్రాడ్యుయేట్​ఓటు(Graduate MLC vote) వేయడంలో కూడా కొంత అవగాహన ఉండాలి. లేదంటే ఓటు చెల్లదు. సాధారణ ఎన్నికల్లో మనం అనుకున్న అభ్యర్థి గుర్తుపై ఈవీఎం(EVM) మిషన్లలో బటన్​నొక్కుతాం. ఇక్కడ ఈవీఎం మిషన్, వీవీ ప్యాట్​ఉంటుంది. అయితే ఈ రెండూ ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల్లో ఉండవు. కేవలం పాత బ్యాలెట్​పద్ధతిలోనే ఓటు వేయాల్సి ఉంటుంది. అది కూడా ప్రాధాన్య క్రమంలో ఓటు వేయాలి. ఇలా ప్రాధాన్య క్రమంలో ఓటు వేసేటప్పుడే కొంత తికమక ఉంటుంది. అది తెలుసుకుంటే సులువే. ఇంతకు ముందు పట్టభద్రుల ఓటు వేసిన వారికి కూడా తెలిసే ఉంటుంది. ఈ నెల 27వ తేదీన గుంటూరు, కృష్ణా(Guntur, Krishna) జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు(Elections) జరగనున్నాయి. ఈ ఓటు వేసేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.. అవేంటంటే..

ముందుగా ఓటరు జాబితాలో మీపేరు ఉందో లేదో చూసుకోవాలి. మీకు ఓటు ఉంటే వార్డు సచివాలయ సిబ్బంది ఇప్పటికే స్లిప్(Voter slip)​ అందించి ఉంటారు. లేదంటే మీరే వెళ్లి తీసుకోవలసి ఉంటుంది. ఆ స్లిప్, దానితో పాటు ఏదో ఒక గుర్తింపు పత్రంతో పోలింగ్​కేంద్రానికి వెళ్లాలి. స్లిప్​ లేకపోయినా పోలింగ్​కేంద్రం నెంబరు, మీ వరుస సంఖ్య తెలిస్తే చాలని అధికారులు చెబుతున్నారు. పోలింగ్​కేంద్రంలోకి(Poling Sration) వెళ్లగానే పేరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకుని బ్యాలెట్(Ballet)​పత్రం ఇస్తారు. ఇక్కడి వరకు పాత సాధారణ ఎన్నికల పద్ధతిలోనే ఉంటుంది. మీకు ఇచ్చిన బ్యాలెట్​పేపర్​లో అభ్యర్థుల పేరు, ఫొటోలు ఉంటాయి. దానిలో మీరు ప్రాధాన్యత క్రమంలోనే ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే.. మొదటి ప్రాధాన్యం ఇచ్చే వారికి 1 అనే నెంబరు వేయాలి. మిగిలిన వారికి 2, 3 ఇలా నెంబర్లు ఇవ్వవచ్చు. మీరు ఒకరికే ఓటు వేయాలనుకుంటే ఒకటి నెంబరు అని మాత్రమే వేయవచ్చు. బ్యాలెట్​పేపర్​పై అంకె నమోదు చేసే సమయంలో అక్కడి సిబ్బంది ఇచ్చే పెన్నును మాత్రమే ఉపయోగించాలి.

గ్రాడ్యుయేట్​ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు(cadidates)అందరికీ ఒకే నెంబరు ఇవ్వకూడదు. అంటే ఇద్దరు ముగ్గురికి ప్రాధాన్యత నెంబర్లు ఇవ్వాలని అనుకుంటే ఒకటి, రెండు, మూడు అని రాయాలి కానీ.. 2,2,2, ఇలా ఇవ్వకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇంగ్లిష్​లోనో, తెలుగులోనో నెంబర్లు వేయకూడదు. అంకెల్లో మాత్రమే రాయాలి. అంకెలు వేయడం పూర్తయిన తర్వాత అక్కడి సిబ్బంది సూచించిన విధంగా మడత పెట్టాలి. అంకె వేయకుండా బ్యాలెట్​తిరిగి ఇచ్చినా అది చెల్లదు. బ్యాలెట్​పేపర్​పై చుక్కలు, టిక్కులు వంటివి పెట్టకూడదు. సూచించిన గడిలోనే అంకె వేయాలి. 1వ ప్రాధాన్యం ఇవ్వకుండా మిగిలిన నెంబర్లు వేసినా చెల్లదు. వీటిపై కొంచె అవగాహన ఉండి ఓటు వేడయానికి వెళితే.. ఈజీనే!

Next Story