- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Graduate MLC: ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పేరాబత్తుల విజయం
ఉత్కంఠగా సాగిన ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం (Perabathula Rajasekhar) విజయం సాధించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్కంఠగా సాగిన ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం (Perabathula Rajasekhar) విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులుపై గెలుపొందారు. ఇప్పటి వరకు జరిగిన ఏడు రౌండ్లలోనూ రాజశేఖరమే లీడింగ్‌లో కొనసాగారు. ఆయన మొత్తం 1,12,331 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులుకు 41,268 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ క్రమంలో వీర రాఘవులుపై పేరాబత్తుల రాజశేఖరం 71,063 ఓట్ల ఆధిక్యతలో నిలిచారు. విజయానికి కావాల్సిన పోలైన ఓట్లలో 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లను కూటమి అభ్యర్థి సాధించారు. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో పేరాబత్తుల రాజశేఖరం విజయం ఇప్పటికే ఖరారైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉద్యోగుల హ్కులను కాపాడుతానని అన్నారు. పట్టభద్రులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని తెలిపారు. అదేవిధంగా తన గెలుపు కోసం పని చేసిన జనసేన, బీజేపీకి ప్రత్యేక పేరాబత్తుల రాజశేఖరం కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మొత్తంగా 2,18,902 ఓట్లు పోల్ అయ్యాయి. కౌంటింగ్ సందర్భంగా 243 పోస్టల్ బ్యాలెట్లకు గాను 201 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లగా.. అందులో 42 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. బ్యాలెట్లను కట్టలు కట్టేందుకు 12 గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు. ఓట్ల కౌంటింగ్ ప్రక్రియలో మొత్తం 700 మంది కౌంటింగ్ సిబ్బంది మూడు షిఫ్టుల్లో పని చేశారు.






