- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలు.. సీఎస్ కీలక ప్రకటన
రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా దూసుకెళ్తున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా దూసుకెళ్తున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో వాట్సప్ ద్వారా 150 రకాల పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary) కె.విజయానంద్(K. Vijayanand) తెలిపారు. ఈ క్రమంలో సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రాన్ని సందర్శించిన అనంతరం.. ప్రభుత్వంలో వివిధ శాఖలు తమ పనితీరు మెరుగుపరచుకోవడానికి వీలుగా RTGS సాంకేతిక సహకారాన్ని అందించాలని వెల్లడించారు. ఆర్టీజీఎస్ కార్యకలాపాలను ప్రత్యక్షంగా తానే పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు.
పౌరులకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు(CM Chandrababu) వాట్సప్ గవర్నెన్స్‌ను(WhatsApp Governance) తీసుకురావాలని నిర్ణయించారని సీఎస్ విజయానంద్ తెలిపారు. వాట్సప్ గవర్నెన్స్‌కు సంబంధించి పనులు ఎంత మేరకు వచ్చాయని ఆయన ఆర్టీజీఎస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీజీఎస్ CEO దినేష్(Dinesh) కుమార్ స్పందిస్తూ.. వాట్సప్ గవర్నెన్స్‌కు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తి చేశామన్నారు. ఈ క్రమంలో దానికి సంబంధించి డెమోను సీఎస్‌కు చూపించారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా ఈ సంస్థ పని చేసి అద్భుతమైన ఫలితాలను సాధించాలని సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు.






