Govt GOs:ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగు భాషలోనే.. తొలిసారి ఆ జీవో విడుదల చేసిన ప్రభుత్వం

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-05 08:54:31  IST  )

ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకు వెళ్తోంది.

Govt GOs:ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగు భాషలోనే.. తొలిసారి ఆ జీవో విడుదల చేసిన ప్రభుత్వం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో గత(జనవరి) నెలలో సీఎం చంద్రబాబు తెలుగు సమాఖ్య మహసభలకు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాతృభాష ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. వివిధ రంగాల్లో తెలుగు వ్యక్తులు సాధించిన ఘనతను కొనియాడారు. ఈ క్రమంలో తెలుగు వారు ఎక్కడున్న ఒక్కటే అని స్పష్టం చేశారు. ఈ విధంగా తెలుగు భాషకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అయితే.. ఇంత వరకూ జీవోలన్నీ ఇంగ్లీష్‌లో విడుదలయ్యే సంగతి తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం(AP Government) ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగు(Telugu)లోనూ జారీ చేయాలని నిర్ణయించింది. ఇంగ్లీష్‌‌తో(English) పాటు తెలుగు భాషలోనూ ప్రభుత్వ జీవోలు(Government G.O) జారీ చేయాలని పేర్కొంది. అయితే ఈ నిర్ణయం జనవరి నుంచే అమలు కావాల్సి ఉన్నప్పటికీ.. సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ ప్రక్రియ ప్రారంభమైంది.

తాజాగా రాష్ట్ర హోంశాఖ(State Home Department) ఓ ఖైదీ(captive)ని పెరోల్ పై విడుదల చేయడానికి సంబంధించిన జీవోను ఇంగ్లీషుతో పాటు తెలుగులోనూ జారీ చేసింది. ఇక నుంచి ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ప్రతి జీవో మొదట ఇంగ్లీషులో విడుదల అవుతుంది. ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలో అదే జీవో తెలుగులోనూ విడుదల కానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై తాము కూడా జీవో(G.O)లో ఏముందో చదువుకునే వెసులుబాటు ఉంటుందని.. ప్రభుత్వం అందిస్తున్న పథకాల వివరాలు సులభంగా అర్థం చేసుకునే వీలుంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story