ఏపీ మద్యం కుంభకోణం కేసు.. గోవిందప్ప బాలాజీకి రిమాండ్

by Naga Rani Yarlagadda |

ఏపీ మద్యం కుంభకోణం కేసు (AP Liquor Scam Case)లో 33వ నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీ(Govindappa Balaji)కి విజయవాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB Court) రిమాండ్ విధించింది.

ఏపీ మద్యం కుంభకోణం కేసు.. గోవిందప్ప బాలాజీకి రిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మద్యం కుంభకోణం కేసు (AP Liquor Scam Case)లో 33వ నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీ(Govindappa Balaji)కి విజయవాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB Court) రిమాండ్ విధించింది. ఈనెల 20 వరకూ గోవిందప్పకు రిమాండ్ విధించడంతో.. పోలీసులు అతన్ని విజయవాడ జైలుకు తరలించారు. వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణంలో వేలకోట్ల రూపాయల ముడుపులను డొల్ల కంపెనీలకు మళ్లించడంలో భారతి సిమెంట్స్ (Bharati Cements) డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ కీలకంగా వ్యవహరించడంతో సిట్ అతడిని ఇటీవలే అరెస్ట్ చేసింది. నెలరోజులుగా అతను పరారీలో ఉండగా.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లోని చామరాజనగర జిల్లా బీఆర్ హిల్స్ అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి అక్కడే అరెస్ట్ చేసి రాష్ట్రానికి తీసుకొచ్చారు.

గోవిందప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో.. కీలక వివరాలన్నీ విచారణలో రాబట్టేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిస్తే విచారణ చేయాలని భావిస్తోంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy)కి కూడా గోవిందప్ప సన్నిహితుడే. ప్రముఖ మద్యం బ్రాండ్లను కావాలనే ఆపేసి కోట్ల రూపాయలను ఆర్జించారని సీఐడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. లిక్కర్ సిండికేట్ లో ఇతను సభ్యుడిగా ఉండి మద్యం ఆర్డర్ ఆఫ్ సప్లై, గుర్తింపు పొందిన బ్రాండ్ల నిలిపివేతలో కీలకంగా వ్యవహరించాడని తెలిపింది.

Next Story