Visakha: విశాఖ డిప్యూటీ మేయరుగా గోవిందరెడ్డి

by Thanuru Gopichand |

శాఖ డిప్యూటీ మేయరుగా జనసేన పార్టీకి చెందిన కార్పరేటర్​ దల్లి గోవిందరెడ్డి ఎన్నికయ్యారు.

Visakha: విశాఖ డిప్యూటీ మేయరుగా గోవిందరెడ్డి
X

దిశ, డైనమిక్​బ్యూరో: విశాఖ డిప్యూటీ మేయరుగా జనసేన పార్టీకి చెందిన కార్పరేటర్​ దల్లి గోవిందరెడ్డి ఎన్నికయ్యారు. నిన్న కోరం లేక వాయిదా పడిన ఎన్నిక ఈ రోజు జరిగింది. గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. 59 మంది సభ్యుల కోరంతో సమావేశం నిర్వహించారు. నిన్నటి సమావేశానికి ఇద్దరు టీడీపీ సభ్యులు హాజరు కాకపోవడంతో కొంత ఉత్కంఠ ఏర్పడింది. అసంతృప్తులను బుజ్జగించడంతో ఈ రోజు వారు సమావేశానికి హాజరయ్యారు. దీంతో కూటమి ప్రతిపాదించిన 64వ డివిజన్​కు చెందిన జనసేన కార్పొరేటర్​గోవిద్​రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

Next Story