- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Justice Abdul Nazeer) ఇవాళ ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో లోక్‌భవన్ (Lok Bhavan) సిబ్బంది ఆయనను హుటాహుటిన తాడేపల్లిలోని మణిపాల్ (Manipal) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్య బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోంది. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ప్రస్తుతం ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ అస్వస్థతకు గల ఖచ్చితమైన కారణాలపై పబ్లిక్ హెల్త్ బులెటిన్ వెలువడాల్సి ఉంది.
హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ..
ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ (Justice Lisa Gill) ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. సాధారణంగా గవర్నర్ ఈ ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. అయితే, ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో ఈ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరుకావాల్సి ఉంది. గవర్నర్ ఆరోగ్యంపై సమాచారం అందుకున్న అధికారులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.






